ETV Bharat / entertainment

'ఆయన రియాక్షన్​ చూశాక ఆస్కార్​ దక్కినట్టు అనిపించింది' - టాలీవుడ్​ అప్​డేట్స్​

క్షణం, గూఢచారి వంటి థ్రిల్లర్​ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చించుకున్న నటుడు.. అడివిశేష్. తాజాగా 'మేజర్​'గా మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా 'మేజర్'​ సహా ఆయన తదుపరి చిత్రాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

మేజర్
మేజర్
author img

By

Published : May 29, 2022, 7:33 AM IST

విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్‌. 26/11 హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెర కెక్కిన 'మేజర్‌' చిత్రం చేశారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్‌. ఈ సందర్భంగా ఆయన 'ఈనాడు సినిమా'తో ఫోన్‌లో సంభాషించారు.

విడుదలకి ముందే పలుచోట్ల సినిమాని చూపిస్తున్నారు. ఆ నిర్ణయం వెనుక కారణమేంటి?

అమాయకమైన కారణాలతో తీసుకున్న నిర్ణయం అది. తెలుగులో ప్రచారం చేసినట్టుగా, హిందీలోనూ టెలివిజన్‌ కార్యక్రమాల్లో పాల్గొందామని మేం భావించాం. అక్కడ కొన్ని షోలు రద్దయ్యాయి. మా సినిమా విడుదల సమయానికి ఇలాంటి అడ్డంకులు వచ్చాయేమిటి అనిపించింది. మా సినిమా ఎంత బాగుందో మేం షోలల్లో పాల్గొని చెప్పేబదులు, సినిమానే చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మేజర్‌ సందీప్‌ సాహసం స్ఫూర్తితో మేం ధైర్యంగా వేసిన అడుగు అది. భారతీయ సినిమా చరిత్రలో ఓ పెద్ద సినిమాని పది రోజుల ముందే పది నగరాల్లో ప్రదర్శించడం చాలా పెద్ద విషయం. ప్రేక్షకుల నుంచి నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన స్పందనని చూశా.

మేజర్‌ సందీప్‌ తల్లి దండ్రులు సినిమాని చూశారా?

వాళ్లు ఇప్పటికే చాలా సన్నివేశాల్ని చూశారు. 31వ తేదీన పూర్తిస్థాయి సినిమాని బెంగళూరులో చూస్తారు. నిర్మాణంలో భాగమైన కథానాయకుడు మహేష్‌బాబు చూశారు. అందమైన వ్యక్తి నుంచి అంతే అందమైన స్పందన వచ్చింది. ఆయన మెచ్చుకోవడం మాకు ఆస్కార్‌ గెలవడంతో సమానం.

26/11 నేపథ్యాన్ని ఇదివరకు చాలా మంది స్పృశించారు కదా...?

'తొలిప్రేమ' వచ్చిందని 'ఖుషీ' చూడకుండా ఉండలేం కదా. మేం చెప్పాలనుకున్నది ఒక అందమైన జీవితం గురించి. అందులో కార్గిల్‌ యుద్ధం ఉంటుంది, 26 /11 నేపథ్యమూ ఉంటుంది. సందీప్‌ హైదరాబాద్‌ కంటోన్మెంట్‌లో కెప్టెన్‌. హర్యానాలో ట్రైనింగ్‌ ఆఫీసర్‌. సందీప్‌ తన ఆఖరి 36 గంటల్లో ఎన్ని వందలమంది ప్రాణాలు కాపాడి చనిపోయారో అందరికీ తెలుసు కానీ... దానికి ముందు 31 ఏళ్లు ఎంత అందంగా బతికారనేది ఎవరికీ తెలియదు. సినిమాలో మొదటి 35 నిమిషాలు 'జానే తు యా జానే నా', 'నువ్వే కావాలి' లాంటి సినిమాలు చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది.

సందీప్‌ జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారా?

సందీప్‌ జీవిత సారాన్ని తీసుకుని చేసిన కథ ఇది. కొన్ని కల్పితాలు ఉండొచ్చు కానీ.. ఆ జీవితానికీ, అందులోని భావోద్వేగాలకి న్యాయం చేస్తున్నామా లేదా? అనేది చూసుకునే సినిమా చేశాం. పక్కింటి కుర్రాడు. అమ్మానాన్నతో కలిసి పాయసం తింటూ దాని గురించి మాట్లాడిన కుర్రాడు. స్కూల్‌కి వెళుతూ, సరదాగా ఆడుకుంటూ, గళ్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లు చెబుతూ, స్నేహితులతో కలిసి స్కూల్‌కి బంక్‌ కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరిగిన ఆ కుర్రాడు మేజర్‌ సందీప్‌ ఎలా అయ్యాడు? కార్గిల్‌ యుద్ధంలోనూ, తాజ్‌ లోపల తను తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలకి అప్పటిదాకా గడిపిన అతని జీవితం ఎలా ప్రభావితం చేసిందనే విషయాల్ని ఇందులో చూపించాం.

ఈ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లేంటి?

అడుగడుగునా సవాళ్లే. చిత్రీకరణ ఊపందుకుంటోంది అనుకునే సమయంలోనే కొవిడ్‌ భయపెట్టేది. వందకిపైగా రోజులు, 75 లొకేషన్లు, ఎనిమిది భారీ సెట్లు నిర్మించి సినిమా చేశాం. దిల్లీ, హర్యానా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో చిత్రీకరణ చేశాం. మిలటరీ లొకేషన్లలో చిత్రీకరణ చేయడం అన్నిటికంటే పెద్ద సవాల్‌. అనుమతులు అంత సులభంగా రావు. చాలా రోజుల తర్వాత పూర్తిగా మన హైదరాబాద్‌లో తయారైన భారతీయ సినిమా ఇది.

ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపుని సాధించనున్నారు. ఆ విషయంపై మీ అభిప్రాయం?

ఆల్‌ ఇండియన్‌ మనిషి సందీప్‌ గురించి సినిమా చేశాననేది నా భావన. అంతకంటే వేరే ఆశలు పెట్టుకుని నేను చేయలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? చూశాక ప్రేక్షకులు ఏమనుకుంటారనే సందేహం ఏ రోజూ కలగలేదు. మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడంతోపాటు, కచ్చితంగా నా కెరీర్‌పై పలు రకాలుగా ప్రభావం చూపిస్తుందనైతే నమ్ముతాను.

కెరీర్‌పై మీ అమ్మానాన్నలు ఏమంటున్నారు?

'క్షణం' సినిమాతోనే నేను నటుడిగా స్థిరపడిపోయాననే భావన వాళ్లలో కలిగింది. ఏదైనా సినిమా ఆలోచన పంచుకోవడానికి సిద్ధమైతే 'నువ్వు సినిమా తీస్తున్నావంటే అది బాగుంటుందిరా. చెప్పాల్సిన అవసరమే లేదు' అంటుంటారు మా నాన్న. నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంస అది. ప్రేక్షకులు నాపై ప్రదర్శిస్తున్న నమ్మకం గుర్తొస్తే తృప్తి కలుగుతుంది.

కొత్త సినిమాల కబుర్లేమిటి?

నాని నిర్మాణంలో రూపొందుతున్న 'హిట్‌ 2' సినిమా ఉంది. మార్వెల్‌ ప్రపంచంలాగా దాన్ని మరింత పెద్దగా చేద్దామని నన్ను ఆ ప్రాజెక్ట్‌లోకి రమ్మన్నారు. ఒకొక్క పోలీస్‌ అధికారి కథ ఒకొక్క నగరంలో జరుగుతుంటుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. తదుపరి ‘గూఢచారి2’ చేయాలి. స్క్రిప్ట్‌ రాయడంపై దృష్టిపెట్టా. కథకి అవకాశం ఉందన్నప్పుడు కచ్చితంగా నా సినిమాల్ని పాన్‌ ఇండియా మార్కెట్‌ లక్ష్యంగానే రూపొందిస్తాం.

రచన పరంగా ప్రభావం చూపిస్తున్నారు. దర్శకత్వంపై దృష్టి పెడదామనే ఆలోచనలు వస్తుంటాయా?

నేనొక విజయవంతమైన నటుడిని, మంచి రచయితని, దర్శకుడిగా పరాజితుడిని. ఆ మాట చాలా నమ్మకంగా చెబుతాను. అయితే నేను రచయితని కావడం నా కెరీర్‌కి చాలా మేలైంది. కథల కోసం ఎవరి దగ్గరికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మంచి కథలు మన దగ్గరే ఉన్నాయని తెలుసు కాబట్టి! ఈ సినిమా విషయంలో దర్శకుడు శశికిరణ్‌ తిక్క పడిన కష్టం చాలా ఎక్కువ. తను సితార సంస్థలో సినిమా చేస్తుంటే, ఒక్క ఏడాది అని చెప్పి తీసుకొచ్చా. తీరా మూడేళ్లయింది. నా కెరీర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు తను. సందీప్‌లాంటి ఓ గొప్ప మనిషి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. వాటిలో ఏది చూపించాలనే విషయంపై శశికిరణ్‌ అద్భుతమైన పనితీరుని ప్రదర్శించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : మహేశ్​ నన్ను స్టూడియో మొత్తం పరిగెత్తించాడు: సూపర్​స్టార్ కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.