శ్రుతి హాసన్.. తండ్రి ఓ సూపర్ స్టార్ అయినా అతడి నీడ పడకుండా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాలు నటించింది. తెలుగులో ఒకప్పుడు ఐరన్ లెగ్ అని అవమానాలు ఎదుర్కొన్న శ్రుతి.. ఇప్పుడు అగ్ర కథానాయకుల సరసన నటిస్తోంది. పవన్ కల్యాణ్‌తో నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాతో ఈ అమ్మడు సుడి తిరిగిపోయింది. నిజానికి పవన్, శ్రుతి ఇద్దరికీ ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ పిల్లి కళ్ల భామ. బాలకృష్ణ తర్వాతి సినిమా 'ఎన్బీకే 107', మెగాస్టార్ సినిమా 'మెగా 154' లో నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాతో కన్నడలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ అమ్మడు రేంజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. తాను ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. " నేను గ్రీస్‌లో ఎందుకు ఉన్నానో అనే విషయం మీతో పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రత్యేక ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఎక్సైట్ అవుతున్నా" అని రాసుకొచ్చింది.
-
FINALLY! So happy to share with all of you why I’m in Greece !! 😁 super stoked to be a part of this special and exciting project 💕🧿 https://t.co/rTu8owUEC5
— shruti haasan (@shrutihaasan) October 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">FINALLY! So happy to share with all of you why I’m in Greece !! 😁 super stoked to be a part of this special and exciting project 💕🧿 https://t.co/rTu8owUEC5
— shruti haasan (@shrutihaasan) October 20, 2022FINALLY! So happy to share with all of you why I’m in Greece !! 😁 super stoked to be a part of this special and exciting project 💕🧿 https://t.co/rTu8owUEC5
— shruti haasan (@shrutihaasan) October 20, 2022
అయితే ఈ అమ్మడు ప్రస్తుతం గ్రీస్‌లో ఉంది. 'ది ఐ' అనే హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంది. ఈ సినిమాలో శ్రుతి లీడ్ రోల్లో నటిస్తోంది. మేల్ లీడ్‌గా మార్క్ రోలే నటిస్తున్నారు. ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆర్గొనాట్స్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఓ దీవిలో మహిళ తన భర్తను కోల్పోతుంది. ఆమె అదే దీవికి భర్త అస్థికలు అక్కడే వేయడానికి వెళ్తుంది. అప్పుడు ఆ మహిళకు ఎదురైన సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం.
ఇవీ చదవండి: '30 ఏళ్ల వరకే ఆ పని చేస్తా'.. విష్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వైరల్‌గా రేణూ దేశాయ్ పోస్ట్.. పవన్‌ను ఉద్దేశించి పెట్టిందేనా?