ETV Bharat / entertainment

'ఓ మై గాడ్'.. విమానం నుంచి అలా దూకేశావేంటి మెహ్రీన్! - మెహ్రీన్ అప్డేట్లు

క్యూట్ బ్యూటీ మెహ్రీన్ వరుసగా సాహసాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల క్రితం వాటర్ డైవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ..తాజాగా అబుదాబిలో స్కై డైవ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది. ఓ సారి మీరు ఆ వీడియోను చూసేయండి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 19, 2022, 1:41 PM IST

Mehreen Sky Diving: టాలీవుడ్​ బ్యూటీ మెహ్రీన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సాహసాలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా అబుదాబిలో చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది.

వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి వారెవ్వా అనిపించింది మెహ్రీన్​. స్కై డైవ్​కు వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్​గా ఫీలవుతున్నట్లు చెప్పింది. హార్ట్ బీట్ పెరిగినట్లు వివరించింది. స్కై డైవ్​కు తీసుకెళ్లే సిబ్బందితో కలిసి తేలికపాటి విమానంలోకి ఎక్కింది. వేల అడుగుల ఎత్తుకు చేరాక విమానంలో నుంచి కిందికి డైవ్ చేసింది. గాల్లో తేలుతూ థ్రిల్​గా ఫీలయ్యింది. తన జీవితంలోనే ఈ స్కై డైవ్​ను మరచ్చిపోలేను అని చెప్పింది మెహ్రీన్.

అండర్ వాటర్​లోనూ..
గత కొద్దిరోజులుగా మెహ్రీన్ విహారయాత్రల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. బీచుల్లో సరదాగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా సాహసాలు చేస్తోంది. కొద్దిరోజుల కింద అండర్ వాటర్ డైవ్ చేసి ఆకట్టుకుంటోంది. సముద్ర గర్భంలోని అందాలను తిలకిస్తూ జాలీగా గడిపింది. ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఎంజాయ్ అంటే నీదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే 'హనీ ఈజ్ బ్రేవ్' అని కొనియాడుతున్నారు.

మాజీ సీఎం మనువడితో ఎంగేజ్​మెంట్, పెళ్లి క్యాన్సిల్
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మెహ్రీన్.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది. కొంత కాలం క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనువడితో ఎంగేజ్​మెంట్ చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.