ETV Bharat / entertainment

స్టేజ్​పై నరేశ్​-పవిత్ర రొమాంటిక్‌ డ్యాన్స్​.. చూశారా? - నరేశ్ పవిత్ర లోకేశ్ లైవ్ రొమాంటిక్ డ్యాన్స్​

ప్రముఖ నటుడు నరేశ్‌-నటి పవిత్ర లోకేశ్‌ కలిసి రొమాంటిక్​ డ్యాన్స్‌ చేశారు. ఇద్దరు అదిరిపోయే స్టెప్పులతో ఆడియెన్స్​ చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఆ వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మీరు చూశారా?

Naresh Pavitra Lokesh live Dance video viral
స్టేజ్​పై నరేశ్​-పవిత్ర రొమాంటిక్‌ డ్యాన్స్​.. చూశారా?
author img

By

Published : May 22, 2023, 5:27 PM IST

Updated : May 22, 2023, 6:19 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ట్రెండింగ్‌ కపుల్‌ అంటే టక్కున వినిపించే పేరు నరేశ్​-పవిత్రా లోకేష్‌. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌ షిప్​లో ఉన్న దాదాపుగా అందరికీ సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట.. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ప్రధాన పాత్రల్లో 'మళ్లీ పెళ్లి' అనే సినిమా చేశారు. నరేశ్​.. ఈ మధ్య కాలంతో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు! త్వరలోనే ఈ చిత్రం రిలీజ్​ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్​ను పెంచాయి. అయితే సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంటూ నరేశ్​-పవిత్రా లోకేష్‌.. సినిమాపై మరింత హైప్​ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట ఓ స్టేజ్​పై డ్యాన్స్‌ చేస్తూ రచ్చ చేశారు. రొమాంటిక్ స్టెప్పులు వేసి.. ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మళ్లీ పెళ్లి సినిమా విషయానికొస్తే.. 'ఒక్కడు', 'వర్షం' లాంటి సూపర్‌‌‌‌హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా మారి 'డర్టీ హరి', '7 డేస్ 6 నైట్స్' వంటి బోల్డ్ కంటెంట్ చిత్రాలను రూపొందించారు. ఆయనే ఇప్పుడు మళ్లీ పెళ్లితో ఆడియెన్స్​ ముందుకు రానున్నారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నరేశ్​ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. ప్రముఖ నటుడు నరేశ్‌ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేశ్​ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయసుధ, శరత్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి- అరుల్‌ దేవ్‌ సంగీతం అందించారు. ఎం.ఎన్‌.బాల్‌ రెడ్డి. ఛాయాగ్రహణం అందించారు.

నా జీవిత కథ కాదు.. నరేశ్‌- తన రెండో భార్య రమ్య రఘుపతితో విభేదాలు, ఆయన పవిత్రతో చనువుగా ఉండడం.. తెలిసిన విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో 'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవన్నీ అందులో కనపడుతున్నాయి. దీంతో ఈ సినిమా నరేశ్ జీవిత కథ అని అర్థమవుతోంది. సినీ అభిమానుల్లో ఆసక్తి కూడా నెలకొంది. కానీ ఇది తన జీవిత కథ కాదని ప్రతి ఒక్కరికీ ఏదోక చోట కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందని నరేశ్ అంటున్నారు. చూడాలి మరి తెరపై ఈ సినిమా కథేంటో..

ఇదీ చూడండి: Sarath babu Biography : 3 వేల మందిని దాటుకుని హీరోగా.. 250కి పైగా చిత్రాల్లో..

Last Updated : May 22, 2023, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.