ETV Bharat / entertainment

ఆ ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్న నటుడు సుమన్‌ - actor suman youtube channel

Actor Suman Health Condition తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ తెలిపారు. ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు.

Actor Suman Health Condition
ఆ యూట్యూబ్‌ ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్న నటుడు సుమన్‌
author img

By

Published : Aug 31, 2022, 9:44 AM IST

Actor Suman Health Condition తన ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై స్పందించారు ప్రముఖ సినీ నటుడు సుమన్‌. తాను క్షేమంగా ఉన్నానని అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. సినిమా షూటింగ్‌ నిమిత్తం బెంగళూరులో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.

కథా నాయకుడు, సహాయ నటుడిగా ఎన్నో ఏళ్ల నుంచి సుమన్‌ దక్షిణాది సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ క్రమంలోనే సుమన్‌ మరణించారంటూ ఇటీవల పలు ఉత్తరాది యూట్యూబ్‌ ఛానెల్స్‌లో వీడియోలు దర్శమిచ్చాయి. వాటిని చూసిన సుమన్‌ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. 'ఈ వార్తల్లో నిజమెంత?' అంటూ సోషల్‌మీడియాలోనూ పోస్టులు పెట్టారు. సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్‌ తాజాగా ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. సదరు యూట్యూబ్‌ ఛానెల్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తారల ఇంట చవితి పండుగ ఎలా జరుగుతుందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.