ETV Bharat / entertainment

చికిత్స కొనసాగుతోంది.. ఆ వార్తలు నమ్మొద్దు: శరత్‌బాబు సోదరి - శరత్​ బాబు మృతి

ప్రముఖ సీని నటుడు శరత్‌బాబు (71) మృతి చెందారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఇంకా కన్నుమూయలేదని.. చికిత్స కొనసాగుతోందని శరత్​ బాబు సోదరి తెలిపారు. మరోవైపు.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

Sarat babu died
చికిత్స కొనసాగుతోంది.. ఆ వార్తలు నమ్మొద్దు: శరత్‌బాబు సోదరి
author img

By

Published : May 4, 2023, 6:26 AM IST

Updated : May 4, 2023, 7:30 AM IST

సెలబ్రిటీలు ఏమాత్రం అనారోగ్యంగా కనిపించినా, వారు ఆస్పత్రిలో జాయిన్​ అయినా.. వారిపై పలు రకాల కథనాలు వచ్చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి పతాక స్థాయికి చేరుకుంటుంటాయి. ఫలానా సెలబ్రిటీ చనిపోయారని ఊహాగానాలు కూడా వ్యాపిస్తుంటాయి. గతంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్​ కూడా బతికుండగానే కన్నుమూశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ వాటిని.. ఆ నటులే స్వయంగా ఖండించారు. బతికుండగానే తమను చంపేయొద్దంటూ వార్తా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్​ సీనియర్ నటుడు శరత్ బాబుపై కూడా అలాంటి తరహా కథనాలే వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన శరత్‌బాబు(71) మృతి చెందారంటూ తాజాగా పలు వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. గాసిప్ రాయుళ్లు రాసిన వార్తలు.. ఆ నోటా ఈ నోటా చక్కర్లు కొడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇది చూసిన కొందరు సినీ ప్రముఖులు కూడా నెట్టింట సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వారు కూడా నిజమని నమ్మేశారు. అయితే ఈ విషయంపై శరత్‌బాబు సోదరి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండిస్తూ.. శరత్​ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. శరత్‌బాబు మునుపటి కన్నా కొంచెం కోలుకున్నారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే శరత్‌బాబు పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాతారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు, తమ స్వగ్రామంలో ఉన్న శరత్‌బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదని మీడియాకు క్లారిటీ ఇచ్చారు. దీంతో శరత్ బాబు మృతి అంటూ వచ్చే వార్తలు ఫేక్ న్యూస్ అని కన్ఫామ్​ అయింది. అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. శరత్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

విషమంగా పరిస్థితి.. అయితే శరత్‌బాబు ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్సలు అందిస్తోందని పేర్కొంది. వైద్య నిపుణుల పర్యవేక్షణతో ఆయన వేగంగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

కాగా, శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. టాలీవుడ్​లో విలక్షణమైన నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. కెరీర్​లో 200కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా, విలన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గానూ ఆడియెన్స్​ను అలరించారు. 1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఆయన.. ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. తెలుగులో చివరిసారిగా పవన్​కల్యాణ్ 'వకీల్​సాబ్'​లో కనిపించారు.

ఇదీ చూడండి: పుష్ప-2 ఆడియో రైట్స్​కు రికార్డు ధర.. పాటలకే అన్ని కోట్లా?

Last Updated : May 4, 2023, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.