తమిళంలో అగ్ర కథానాయకుడైన శరత్‌కుమార్ అంటే సినీ ప్రపంచంలో తెలియనని వారుండరు. తన విలక్షణ నటనతో తండ్రిగా, అన్నగా, అమ్మాయిల మనసులు దోచే హీరోగా, ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చిన ఇట్టే ఒదిగిపోతారు. కోలీవుడ్‌లో సుప్రీం స్టార్‌గా పేరు తెచ్చుకున్న శరత్‌కుమార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉత్సాహంగా ఉంటారు. ఆరుపదుల వయసులోనూ యంగ్ అండ్ డైనమిక్‌గా నేటి హీరోలకు పోటీగా నటిస్తుంటారు.
తాజాగా పొన్నియన్ సెల్వన్-Iలో ఓ కీలక పాత్ర పోషించారు శరత్ కుమార్. అటు తమిళంలో ఇటు తెలుగులోనే కాదు బీటౌన్‌లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంతటి బిజీ స్టార్‌కి ఇప్పుడు కాల్షీట్లో డేట్స్ ఖాళీ లేవట.. దానికి కారణం ఆయన ఇంకొన్ని ప్రాజెక్టుల్లో నటించడమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఇప్పుడు ఆయన లిస్ట్‌లో ఉన్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న పెద్ద ప్రాజెక్టులన్నీ ఈ హీరో కాల్షీట్లో డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాలు నటించనున్నారు.
తమిళ హీరో విజయ్ అప్‌కమింగ్ మూవీ 'వారిసు'లోనూ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అంతేకాదు మమ్ముట్టి, నాగ చైతన్య, రాఘవ లారెన్స్ లాంటి కథానాయకుల నయా ప్రాజెక్టుల్లోనూ శరత్‌కుమార్ నటించనున్నారు. భార్య రాధిక, తనయ వరలక్ష్మీతో ఓ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారు.
ఇదీ చదవండి : తిరుపతిలో 'భారతీయుడు2'.. చైతూతో ఢీ అంటున్న అగ్ర కథానాయకుడు!
రూ.1000 కోట్ల రెమ్యునరేషన్.. సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఏంటంటే?