ETV Bharat / entertainment

'భార్యకు ప్రతి నెలా 8 లక్షల భరణం ఇవ్వాలి'.. నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు ఆదేశం

నటుడు పృథ్వీరాజ్‌ తన భార్యకు భరణం ఇవ్వాలని విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) ఆదేశించింది. తనను ఇంటి నుంచి గెంటేశాడని అతడి భార్య 2017లో కోర్టును ఆశ్రయించింది. కేసు పుర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. నెలకు ఇన్ని లక్షల చొప్పున ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ఇంతకీ ఎంతంటే..?

actor prudhvi raj
actor prudhvi raj
author img

By

Published : Oct 1, 2022, 9:24 AM IST

Updated : Oct 1, 2022, 10:45 AM IST

సినీ నటుడు పృథ్వీరాజ్‌ తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా రూ.8 లక్షలు భరణం చెల్లించాలని విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు) న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని తీర్పు చెప్పారు. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ (శేషు)తో 1984లో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

'పృథ్వీరాజ్‌ విజయవాడలో మా పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడు. ఆ ఖర్చులన్నీ మా తల్లిదండ్రులే భరించేవారు. ఆయన నన్ను తరచూ వేధిస్తుండేవాడు. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నాను' అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షలు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని తీర్పిచ్చారు.

ఇవీ చదవండి: 'పుష్ప' విలన్ కొత్త సినిమా.. సత్యదేవ్ మల్టీ స్టారర్​.. కొత్త లుక్కులో మమ్ముట్టి

పవర్​ఫుల్​గా నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్

Last Updated : Oct 1, 2022, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.