Senior Actor Naresh on ticket rates: టికెట్ ధరల పెంపుపై సీనియర్ నటుడు నరేశ్ మండిపడ్డారు. కంటెంట్ ఉంటే జనాలు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు నిరూపించినప్పటికీ... జనాలు థియేటర్‌కు రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయని సీనియర్ నటుడు నరేశ్ చెప్పారు.
"టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల జనాలు థియేటర్‌కు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సీ, పాప్‌కార్న్ రూ.20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే. అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి"
-నరేశ్, సీనియర్ నటుడు
ఆ వెంటనే మరో ట్వీట్‌లో.. 'ఒకప్పుడు వారం రోజులపాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు జనాలు వస్తారు' అని నరేశ్ రాసుకొచ్చారు.
ఇవీ చదవండి: లైగర్ గురించి మైక్ టైసన్ అప్పుడే మర్చిపోయారా, వైరల్ అవుతున్న వీడియో
భవదీయుడు భగత్ సింగ్‌పై డైరెక్టర్ అదిరే అప్డేట్, ట్విట్టర్లో పవన్ రికార్డు