ETV Bharat / entertainment

లోకేశ్​ యూనివర్స్‌.. విజయ్​ సినిమాలో ఏడుగురు స్టార్‌ హీరోలు! - లోకేష్​ కనగరాజ్​ విజయ్ సినిమా

దర్శకుడు లోకేశ్​ యూనివర్స్​కు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది. ఆయన దళపతి విజయ్​తో చేయబోయే సినిమాలో ఏడుగురు స్టార్ హీరోలు కనపించబోతున్నారట. ఆ వివరాలు..

Lokesh kanagaraj
లోకేష్‌ యూనివర్స్‌.. ఒకే మూవీలో ఏడుగురు స్టార్‌ హీరోలు!
author img

By

Published : Dec 13, 2022, 11:04 AM IST

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో లోకేశ్‌ కనగరాజ్‌ ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఏడాది ఆయన దర్శకత్వం వహించిన విక్రమ్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూనివర్సల్​ స్టార్​ కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు! ఈ సినిమా ద్వారా లోకేష్‌ కనగరాజ్‌ తన లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా భారీ తారాగణం ఉండనుందట. ఒకే సినిమాలో ఏకంగా ఏడుమంది స్టార్లు కలిసి నటించనున్నారట. విజయ్‌తోపాటు కమల్‌ హాసన్‌, సూర్య, కార్తీ, సంజయ్‌ దత్‌, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌లు కనిపించనున్నారని తెలిసింది. విక్రమ్‌ సినిమాలో సూర్య గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చినట్లు.. విజయ్‌ సినిమాలో మిగిలిన ఆరుగురు గెస్ట్​లుగా రానున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో షూట్‌ కూడా కంప్లీట్‌ అయిందట. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట్లో హాట్ టాపిక్​గా మారింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇంత మంది స్టార్‌ హీరోలను ఒకే సినిమాలో చూడటం ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే విజయ్​ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమా వివరాలను తాజాగా పంచుకున్నారు లోకేష్​. అంతేకాదు, మైండ్‌ బ్లోయింగ్‌ విషయాలను కూడా చెప్పారు. రాబోయే పదేళ్లకు సరిపడా సినిమాల షెడ్యూల్‌ తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఓ ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌తో కలిసి పాల్గొన్న ఆయన ఈ విషయాలను తెలిపారు.

''ప్రస్తుతం ఇళయదళపతి విజయ్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నా. దీని తర్వాత కమల్‌హాసన్‌ సర్‌తో కూర్చొని మాట్లాడతా. ఆ తర్వాత 'ఖైదీ2' మొదలు పెడతా. అది పూర్తయిన వెంటనే 'విక్రమ్‌' సీక్వెల్‌ ఉంటుంది. అంతేకాదు, రోలెక్స్‌ (విక్రమ్‌లో సూర్య పోషించిన పాత్ర) నేపథ్యంలో మూవీ కూడా ఉంటుంది. పరిస్థితులను బట్టి ఈ చిత్రాలు అటూ ఇటూ కావచ్చు. ఇది మల్టీ యూనివర్స్‌. దీంతో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. అది ప్రీక్వెల్‌ లేదా సీక్వెల్‌ కూడా అవ్వవచ్చు. వచ్చే పదేళ్లకు వరకూ నేను సెటిల్‌ (నవ్వులు) '' అని వివరించారు.

'విక్రమ్‌' మూవీలో డ్రగ్‌ మాఫియాను శాసించే రోలెక్స్‌ పాత్రలో తళుక్కున మెరిశారు సూర్య. క్లైమాక్స్‌లో ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా, థియేటర్‌ దద్దరిల్లిపోయింది. ఈ మూవీ తర్వాత 'ఖైదీ2' ఉంటుందని అందరూ ఆశించారు. ముఖ్యంగా అన్నదమ్ములైన సూర్య, కార్తి వెండితెరపై ఒకే ఫ్రేమ్‌లో కనపడితే చూద్దామని ఎంతోకాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, విజయ్‌తో మూవీ ప్రకటించి లోకేశ్‌ అభిమానులను ఇంకాస్త వెయిటింగ్‌లో పెట్టారు. ఇది కూడా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ మూవీ కావడంతో విజయ్‌ను ఏ పాత్రలో చూపిస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు రోలెక్స్‌ పాత్రతో సింగిల్‌ మూవీ చేయనున్నట్లు ప్రకటించడం ఈ యూనివర్స్‌కు మరింత హైప్‌ తెస్తోంది. 'సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుందట. అప్పుడది ఆకలితో ఉన్నప్పుడు.. అడవి కూడా పస్తు ఉండాలి. 27ఏళ్లు అయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, వాడు.. వాడి బాబు ఊరికే ఇచ్చింది కాదు' అని 'విక్రమ్‌' క్లైమాక్స్‌లో అంటాడు సూర్య.. అంటే రోలెక్స్‌ జీవితం ఎలా మొదలు పెట్టాడు? ఎలా డ్రగ్‌ మాఫియా డాన్‌ అయ్యాడో 'రోలెక్స్‌'లో చూపించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: కేరింత మూవీ భావన పెళ్లి అయిపోయిందోచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.