ETV Bharat / entertainment

స్టార్ దర్శకుడికి షాక్​, ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు - లింగు స్వామి జైలు శిక్ష

దర్శకుడు లింగుస్వామికి కోర్టులో చుక్కెదురైంది. చెన్నైలోని సైదాపేట్​ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎందుకంటే.

prison-for-director-lingusamy-
prison-for-director-lingusamy-
author img

By

Published : Aug 22, 2022, 5:46 PM IST

Lingusamy cheque bounce case: తమిళ దర్శకుడు లింగుస్వామికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. చెక్​బౌన్స్​ కేసులో ఆయనకు ఓ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇదీ జరిగింది.. హీరో కార్తిక్​, హీరోయిన్​ సమంతతో 'యెన్ని ఏలు నాల్​' సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసింది తిరుపతి బ్రదర్శ్​ ప్రొడక్షన్స్​. దీనికి లింగుస్వామి దర్శకుడు. అయితే సినిమా అవసరాలకు పీవీపీ ఫైనాన్స్​ అనే కంపెనీ నుంచి కోటి 35 లక్షలు అప్పుగా తీసుకుని తిరుపతి బ్రదర్స్ నిర్మాతలకు ఇచ్చారు లింగుస్వామి.

ఆ తర్వాత రూ. 35లక్షలను పీవీపీ ఫైనాన్స్​కు చెక్​ ద్వారా చెల్లించారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో సదరు కంపెనీ.. ఆయనపై కోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన చెన్నైలోని సైదాబాద్​ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ.. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. లింగుస్వామి మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది.

కాగా, లింగుస్వామి టాలీవుడ్‌ నటుడు రామ్‌ పోతినేనితో ది వారియర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జులై 14న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్‌ చిత్రంలో విలన్‌ ఆది పినిశెట్టి- హీరో రామ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.