దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా హవా హాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కగా.. ఇప్పుడీ చిత్రానికి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అలానే ఈ చిత్రంలోని నాటు నాటు పాట .. బెస్ట్ సాంగ్ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి అవార్డును అందుకుంటున్నట్లు కనిపించారు. ఇక ఈ పురస్కారాలు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా 'ఆస్కార్' బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఇది ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్ అవుతాయి.
వాళ్లే నా విజయ రహస్యం.. ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అలాగే తన విజయం వెనక కూడా తన తల్లి, భార్య ఉందని అన్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్కు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో రెండు అవార్డులు రావడంపై ఆయన హర్షం చేస్తూ.. ఈ మాటల్ని అన్నారు. "నా జీవితంలో, మా ఇంట్లో మహిళలకు(తల్లి, వదిన, భార్య, కూతుళ్లు) ప్రత్యేక స్థానం. సాధారణ విద్యకు అతి ప్రాధాన్యత ఇస్తున్నారని మా అమ్మ రాజా నందిని నాకు చెప్పేవారు. అందుకే నేను కామిక్స్, కథల పుస్తకాలు చదివేలా ప్రోత్సహించారు. ఆమె మంచి కథలు చెప్పి నన్ను కథకుడిగా తీర్చిదిద్దింది. ఇక మా వదిన శ్రీవల్లి నాకు తల్లిలాంటి వ్యక్తి. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేలా ఆమె ప్రోత్సాహం అందించింది. ఆ తర్వాత నా భార్య రమా, నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ వ్యవహరిస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఆమె నా లైఫ్ డిజైనర్. ఆమె లేకపోతే నేను లేను. ఇక నా కూతుర్లు విషయానికొస్తే వారు ఏమి చేయనక్కర్లేదు. వాళ్ల చిరునవ్వు చాలు నా జీవితంలో వెలుగులు నింపడానికి. చివరిగా నా మాతృభూమికి, మేరా భారత్ మహాన్." అని అన్నారు.
-
Congratulations to the cast and crew of @RRRMovie - winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to the cast and crew of @RRRMovie - winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023Congratulations to the cast and crew of @RRRMovie - winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
కాగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, ఒలివియా మోర్రీస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
-
Naatu Naatu Again!! 🕺🕺❤️🔥
— RRR Movie (@RRRMovie) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Extremely delighted to share that we won the #CriticsChoiceAwards for the BEST SONG💥💥 #RRRMovie
Here’s @mmkeeravaani’s acceptance speech!! pic.twitter.com/d4qcxXkMf7
">Naatu Naatu Again!! 🕺🕺❤️🔥
— RRR Movie (@RRRMovie) January 16, 2023
Extremely delighted to share that we won the #CriticsChoiceAwards for the BEST SONG💥💥 #RRRMovie
Here’s @mmkeeravaani’s acceptance speech!! pic.twitter.com/d4qcxXkMf7Naatu Naatu Again!! 🕺🕺❤️🔥
— RRR Movie (@RRRMovie) January 16, 2023
Extremely delighted to share that we won the #CriticsChoiceAwards for the BEST SONG💥💥 #RRRMovie
Here’s @mmkeeravaani’s acceptance speech!! pic.twitter.com/d4qcxXkMf7
ఇదీ చూడండి: ఎన్టీఆర్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా అయిపోయిందేంటి