ETV Bharat / entertainment

1997లో ఆగిపోయిన కమల్​ సినిమా.. 26ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్​పైకి! - 1997 మరుదనాయగన్ సినిమా

తమిళ స్టార్ హీరో కమల్​హాసన్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 26ఏళ్ల క్రితం ఆగిపోయిన తన సినిమాను మళ్లీ ప్రారంభించనున్నారట. ఆ వివరాలు..

1997 Kamalhassan Movie Marudhanayagam Again Onto Sets
1997 మరుదనాయగన్ మూవీ మళ్లీ సెట్స్​ పైకి
author img

By

Published : Mar 31, 2023, 10:37 PM IST

విలక్షన నటుడు కమల్​హాసన్​ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఎప్పుడూ తన కలల చిత్రంగా చెప్పుకునే 'మరుదనాయగన్​' షూటింగ్​ను పునఃప్రారంభించనున్నారట. 1997లో కమల్​ టైటిల్‌ పాత్రను పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని తిరిగి సెట్స్​పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారట కమల్​.

మరుదనాయగన్ సినిమా చిత్రీకరణను 1997లో ఎంతో ఘనంగా ప్రారంభించారు కమల్​హాసన్​. కమల్​ టైటిల్​ రోల్​లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవానికి ఇంగ్లాండ్​ రాణి ఎలిజబెత్‌ సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈమెతో పాటు అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి మరో రాజకీయ నాయకుడు శివాజీగణేశన్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలోని కొంత భాగం షూటింగ్​ కూడా పూర్తి చేశారు. కానీ బడ్జెట్​తో పాటు పలు కారణాల వల్ల షూటింగ్​కు బ్రేక్​ పడింది. దీంతో సినిమా.. షూటింగ్​ పూర్తి కాకుండానే నిలిచిపోయింది. అయితే మరుదనాయగన్‌ చిత్రం గురించి కమల్​ హాసన్​ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దీనిని ఎలాగైనా పూర్తిచేసి తీరుతానని చెప్పేవారు. ఈ సినిమాలో హాలీవుడ్‌ నిర్మాతలూ సైతం భాగం అవుతారని పలు సార్లు చెప్పారు. అయితే ఇంతవరకు వీటికి సంబంధించిన ఎటువంటి పనులు జరగలేదు.

ఇటీవల చారిత్రక నేపథ్యంలో వచ్చిన బాహుబలి, పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి సినిమాలు గొప్ప విజయాలు సాధించడం వల్ల.. అటువంటి నేపథ్యం ఉన్న మరుదనాయగన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కమల్​ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే సుమారు 26 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు టైటిల్ రోల్​ అయిన తన స్థానంలో ప్రముఖ నటుడు విక్రమ్​ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో పాటు తాను గతంలో నటించిన నటించిన కొన్ని సీన్స్​ను చిత్రంలో కనిపించేలా కథలో కొన్ని మార్పులు చేయనున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారట.

ఇకపోతే కమల్​ హాసన్ గతేడాది విడుదలైన విక్రమ్‌ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్​ను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ఇండియన్‌-2 చిత్రంలో నటిస్తున్నారు. ఇక తన మరో డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'భారతీయుడు 2' పైన కూడా దృష్టి పెట్టారు కమల్​. ప్రముఖ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ కూడా శరవేగంగా జరుగుతోంది. త్వరగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.