YSRCP leader Attack On Farmer: నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకుడు రెచ్చిపోయాడు. ఓ రైతు తన భూమి సాగు చేసుకుంటుండగా.. ఆ భూమి తనదేనని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. మర్రిపాడు మండలంలోని కృష్ణాపురానికి చెందిన అబ్దుల్లా అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. అతని భూమిని వైకాపా నేత చింతగుంట రవి రెడ్డి ఆక్రమించుకున్నాడు. పొలంలోకి రాకుండా అడ్డుకున్నాడు. దీంతో రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో రైతు సాగు చేసుకునేందుకు పొలానికి వెళ్లగా.. భూమి తనదేనంటూ వైకాపా నేత రవి మరికొందరితో కలిసి రైతు కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకాపా నేతల నుంచి తమకు హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
వైకాపా నాయకుడు నా భూమి అక్రమించుకున్నాడు.. పొలం సాగు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. న్యాయస్థానం భూమి నాదేనని తీర్పు ఇచ్చినా.. మళ్లీ భూమి తనదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. అదీకాకుండా.. ఈరోజు పొలంలోకి వెళ్లిన నాపై కొంతమందితో కలిసి దాడికి పాల్పడ్డాడు. -అబ్దుల్లా, బాధిత రైతు
ఇవీ చదవండి: