తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అహ్మదుగుడా రాజీవ్ గృహకల్పలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మొగులమ్మ అనే మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
స్థానికుల సమాచారం మేరకు కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: