Harassment: తండ్రి కోల్పోయిన పిల్లలను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి, పెద్ద దిక్కుగా నిలవాల్సిన మేనమామ వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు రామిరెడ్డితోటకు చెందిన బడే సాహెబ్ బంగారం మెరుగు పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. జనవరి 25న క్యాన్సర్ కారణంగా అతను మృతి చెందాడు. అప్పటినుంచి బడే సాహెబ్ పిల్లలు, అతని భార్య చిన్న బావమరిది వద్ద ఉంటున్నారు.
కుటుంబ పోషణ నిమిత్తం కాల్సెంటర్లో పనిచేస్తున్న పెద్ద అమ్మాయి పైన చిన్న మామయ్య కన్నువేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. తప్పు అని చెప్పాల్సిన తల్లి కూడా మామయ్య చెప్పినట్లు నడుచుకో అని చెప్పింది. దాంతో విసుగు చెందిన ఆ పిల్లలు.. తన తల్లి, మామయ్య వేధింపులు తాళలేక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకి న్యాయం చేయాలని, వారి నుంచి రక్షించాలని ఎస్పీకి విన్నవించారు.
ఇదీ చదవండి:
Cheating: వాలంటీర్ మోసం.. పింఛను పెరిగిందని ఆస్తి కాగితాలపై సంతకాలు..!