ETV Bharat / crime

AP CRIME NEWS: రాష్ట్రంలో పలు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి - ఏపీ క్రైం న్యూస్

AP CRIME NEWS: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కీర్తి మెడికల్‌ స్టోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది.

AP CRIME NEWS
ఏపీ క్రైం న్యూస్
author img

By

Published : May 3, 2022, 2:10 PM IST

Updated : May 4, 2022, 1:18 AM IST

ప్రకాశం జిల్లా: ఒంగోలులోని కీర్తి మెడికల్‌ స్టోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మందులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.

*త్రిపురాంతకం మండలం డీవీఎన్‌ కాలనీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులను యర్రగొండపాలెం మండలానికి చెందిన వెంకటేశ్వర్లు, పోతులూరిగా గుర్తించారు.

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మండలం కరటంపాడు ఈద్గా వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లింలపై తేనెటీగల దాడి చేశాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

*జిల్లాలోని భగత్ సింగ్ కాలనీ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

కోనసీమ జిల్లా: ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక బ్యారేజ్‌ దిగువన స్నానాలు చేస్తూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వారిలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఇంకొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు మహిళలని రాజమహేంద్రవరం వాసులుగా గుర్తించారు.

శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల గురుకుల పాఠశాల వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కరిష్మా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

శ్రీ సత్య సాయి జిల్లా: కర్ణాటక నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1824 మద్యం ప్యాకెట్లను గుర్తించారు. మద్యంతో పాటు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

*శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

వైఎస్సార్​ జిల్లా: వేంపల్లె పట్టణంలో విద్యుత్ షాక్​కు గురై జూనియర్ లైన్​మెన్ మిథున్ చక్రవర్తి మృతి చెందాడు. కాపువీధిలో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​​కు ఫీజులు వేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు జిల్లా: కైకలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వందల లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు.

కృష్ణా జిల్లా: బైక్‌ల దొంగను హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.19 లక్షల విలువచేసే 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా: బైరెడ్డిపల్లి మండలం ఎం.కొత్తూరులో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు.

పల్నాడు జిల్లా: మద్యం మత్తులో ఉన్న నాగరాజు అనే వ్యక్తి నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం ముప్పాళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 10 ఎకరాల సుబాబుల్ తోట దగ్ధమైంది.

కోనసీమ జిల్లా: తాజాగా.. కోనసీమ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆర్‌ఎంపీ వైద్యుడు వేగి రమేశ్‌.. అత్యాచారం చేశాడని పోలీసులకు బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్​ఎంపీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: విజయనగరంలో మహిళపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు

Last Updated : May 4, 2022, 1:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.