ETV Bharat / crime

చెరువులో జారిపడి.. తాత, తండ్రి, మనవడు మృతి! - telangana news

Dead
చెరువులో జారిపడి.. తాత, తండ్రి, మనవడు మృతి!
author img

By

Published : Mar 13, 2022, 3:31 PM IST

Updated : Mar 13, 2022, 4:29 PM IST

15:28 March 13

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఘటన

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చిన్నగురిజాలలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనవడు మృతిచెందారు.

గ్రామంలోని చెరువులో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన నాగరాజు(34) ప్రమాదవశాత్తు జారిపడ్డారు. నాగరాజు నీళ్లలో పడడాన్ని గమనించి, కాపాడేందుకు అతడి తండ్రి కృష్ణమూర్తి(65) చెరువులో దిగాడు. తాత, తండ్రి ఇద్దరూ కనిపించకపోవటంతో ఏం జరిగిందోనన్న భయంతో.. నాగరాజు కుమారుడు లక్కీ(12) కూడా చెరువులో దిగాడు. చెరువులో దిగిన ముగ్గురు మళ్లీ పైకి రాలేదు.

ఊపిరాడక ముగ్గురూ మృతి చెందారు. ఒకే కుంటుంబానికి చెందిన తాత, తండ్రి, మనుమడు మరణించటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవటంతో కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది.

ఇదీ చదవండి: Cyber Crime: నకిలీ యాప్ సృష్టించి.. నగదు కాజేసి..

Last Updated : Mar 13, 2022, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.