ETV Bharat / crime

ఉరవకొండలో వివాహిత ఆత్మహత్య.. భర్తపై బంధువుల అనుమానం - ap crime news

Suspicious death of a married woman: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన వివాహిత తరుపున బందువులు.. తన భర్తే అదనపు ఆస్తి కోసం హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు.

Sirisha
శిరీష
author img

By

Published : Nov 13, 2022, 5:55 PM IST

Suspicious death of a married woman: అనంతపురం జిల్లా ఉరవకొండలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం కలకలం రేపింది. సీవీవీ నగర్​లో నివాసముంటున్న సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ వినోద్​తో.. శిరీషకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. ఆదివారం ఉదయం శిరీష ఇంట్లోనే ఉరి వేసుకొని మృతి చెందిందని భర్త తెలిపాడని.. మృతురాలి బంధువులు చెప్పారు.

శిరీషది ఆత్మహత్య కాదని.. భర్తే హత్య చేశాడని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహ సమయంలో 25తులాల బంగారం, రెండు లక్షల నగదు ఇచ్చి ఘనంగా వివాహం చేశామని తెలిపారు. తరువాత శిరీష పేరున ఐదు సెంట్ల స్థలాన్ని రిజిస్టర్ చేయించామని.. అయితే ఆ స్థలం తన పేరున రిజిస్టర్ చేయాలంటూ భర్త వినోద్.. ఈ మధ్య శిరీషను వేధింపులకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు మూడు సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందన్నారు.

ఆస్తి కోసమే శిరీషను చంపేశాడని.. శిరీష తల్లి లక్ష్మీదేవి ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శిరీష మృతదేహం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా మృతురాలి ఇంట్లో ఒకలేఖ దొరికింది. అందులో.. నాకు ఎలాంటి ఎఫైర్స్ లేవని.. కొడుకును బాగా చూసుకో.. అని రాసి ఉండటం చర్చనీయాంశమైంది. భర్త అనుమానం వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందా..? లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.