MURDER: అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు మనిషి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయి. చిన్న చిన్న విబేధాల కారణంగా కోపోద్రిక్తులై తనువులు చాలించడమో లేక ఇతరులను చంపడమో చేస్తున్నారు. తాజాగా మానసిక స్థితి బాగాలేని కొడుకు తల్లితో గొడవపడ్డాడు. ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.
తిరువూరు మండలం ఎరుకుపాడుకు చెందిన చింతల నాగేంద్రబాబుకు మతిస్తిమితం సరిగా లేదు. తల్లి మంగమ్మతో గొడవపడిన అతను.. పారతో కొట్టి, గొంతు నులిమి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరూవురు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: