ప్రేమ పేరిట సహజీవనం చేసి.. ప్రియురాలి వద్ద నుంచి రూ. 37 లక్షలు తీసుకుని తప్పించుకు తిరుగుతోన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.32 లక్షలు సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిందీ ఘటన.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న జై.. మాయమాటలతో సహోద్యోగినికి దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో మహిళను నమ్మించి.. మూసాపేట్లో నివాసానికి తీసుకువచ్చాడు. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు వ్యాపారం పెడదామంటూ రూ.37 లక్షలు తీసుకొని.. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంటి నుంచి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన మహిళ.. గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇవాళ మూసాపేట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న జై ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: