ETV Bharat / crime

rape: ఆ విషయం అందరికీ చెప్పేస్తామని బెదిరించి.. వివాహితపై అత్యాచారం! - hyderabad rape case

ఓ మహిళ బలహీనతను అడ్డుపెట్టుకొని.. వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ​లోని బోరబండలో జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ ముమ్మరం చేశారు.

Rape of a married woman by interfering with an extramarital affair in hyderabad
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం
author img

By

Published : Dec 17, 2021, 10:27 PM IST

తన రహస్యాన్ని అందరికీ చెప్పేస్తామని బెదిరించి.. ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ మహిల ఈ ఘటన హైదరాబాద్​లోని బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్మాయిల్​ అనే వ్యక్తితో పాటు మరో బాలుడు అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ వెల్లడించింది.

ఎలా వెలుగులోకి వచ్చిందంటే..
ఈ నెల 15న వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో సదరు మహిళ మరో యువకుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వికారాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వైద్యులు చికిత్స అందించి వారి ప్రాణాలను రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వీరు ఇరువురు హైదరాబాద్​లో ఒకే సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చికిత్స తర్వాత బాధిత మహిళ, యువకుడు కోలుకోగా పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళపై ఇద్దరు అత్యాచారం..
బాధిత మహిళకు బోరబండకు చెందిన యువకుడితో గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఇస్మాయిల్​తోపాటు మరో బాలుడు సదరు మహిళను బ్లాక్​మెయిల్​ చేశారు. ఈ విషయం బయటపెడతామని బెదిరించి వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పదేపదే బెదిరిస్తుండడంతో వివాహిత విసిగిపోయింది. తమ వద్ద వీడియోలు ఉన్నాయని భయపెట్టడంతో.. వికారాబాద్ జిల్లా కండ్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి వివాహితతోపాటు సదరు యువకుడు సైతం పురుగుల మందు తాగారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వివాహిత ఫిర్యాదు మేరకు బోరబండకు చెందిన ఇస్మాయిల్​తోపాటు బాలుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

Bhuvanagiri Govt doctors negligence : సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం.. కుట్లు పెకిలి నరకయాతన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.