ETV Bharat / crime

'మంత్రి, ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ.. లైంగిక దాడికి పాల్పడ్డారు'

author img

By

Published : Mar 23, 2021, 10:38 AM IST

‘దంపతుల మధ్య స్పర్థలను అవకాశంగా తీసుకొని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. ఈ విషయమై పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఒక రౌడీషీటర్‌ సమస్య పరిష్కరిస్తానన్నాడు. తండ్రి లాంటి వాడినంటూ మాయమాటలతో నమ్మించి నా నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరించాడు. అతను, తన స్నేహితుడు సామూహిక అత్యాచారం చేశారు. కొద్ది నెలలుగా నగ్న వీడియోలు అడ్డుపెట్టుకొని బెదిరిస్తూ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు' - బాధితురాలు

gnt crime
gnt crime

తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ ఓ మహిళ గుంటూరు రూరల్‌ ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఆవేదన ఆమె మాటల్లోనే..

‘నరసరావుపేటకు చెందిన నేను డిగ్రీ చదువుకున్నాను. 13 ఏళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పాప, బాబు జన్మించారు. నా భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను గెంటేశాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం 47 సవర్లు తీసుకున్నాను. మా ఇంటి వద్ద ఉండే ఇద్దరు వ్యక్తులు సమస్య పరిష్కరిస్తాం. అప్పటి వరకు బంగారం భద్రపరుస్తామని తీసుకున్నారు. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసి బంగారం తీసుకుని రమ్మన్నారు. ఇచ్చేయమని అడిగితే వారిద్దరూ ఇబ్బంది పెడుతున్నారు.

నరసరావుపేట రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాను. అక్కడ 50 ఏళ్ల వ్యక్తి తాను ఒక మంత్రి సోదరుడినని పరిచయమయ్యాడు. ఆయనతో దిగిన ఫొటోలు చూపించాడు. తాను చెబితే పోలీసులు ఏ పని అయినా చేసి పెడతారన్నాడు. తాను తండ్రి లాంటి వాడినని.. తన మాటలు నమ్మాలంటూ మాయమాటలు చెప్పాడు. నరసరావుపేట రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టించాడు. కేసు పరిష్కారం చేసి బంగారం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ ఒక రోజు మా ఇంట్లో నాపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు.

మరుసటి రోజు అతని స్నేహితుడు వచ్చి తనకు కాంగ్రెస్‌ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపాడు. నా సమస్య పరిష్కరిస్తానని.. అందుకు తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. నేను అంగీకరించకపోవడంతో తన వద్ద నా నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, వాటిని ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరంచి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రోజు ఇద్దరూ కలిసి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఆ వీడియోలు పేరిట ఇద్దరూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. బాధ భరించలేక వారి ఎదుటే చనిపోతానని చెప్పాను. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రి, ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ బెదిరించడం, పోలీసులతో కలిసి పంచాయితీలు చేస్తున్నారు. నన్ను హైదరాబాద్‌లోని ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్లాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బంగారం తీసుకొని మోసగించిన వారిపై, మ చిత్రహింసలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని.. ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశాను’- బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.