కాలువలో దాచిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఇద్దరు అరెస్ట్ - చౌదరివారి పల్లిలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
పోలీసులు, అటవీ అధికారులు నిర్వహించిన దాడుల్లో.. ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారు. కడప జిల్లా బద్వేలు అటవీశాఖ రేంజ్లోని చౌదరివారి పల్లిలో జరిగిన ఈ ఘటనలో.. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లా బద్వేలు అటవీశాఖ రేంజ్లోని చౌదరివారి పల్లిలో.. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తెలుగుగంగ కాలువలో దాచిన ఆరు ఎర్రచందనం దుంగలు, ఓ ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: 10 రాష్ట్రాల్లోనే 85శాతం కరోనా కేసులు
ఎర్రచందనం దుంగలను రవాణాకు సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న ఇద్దరు స్మగ్లర్లు.. దువ్వూరు మండలం బుక్కాయపల్లి, చాపాడు మండలం రేపల్లెకు చెందిన వారిగా గుర్తించామన్నారు. మడేరు వద్ద ఇటీవల 142 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నా.. వెనకున్న సూత్రధారులు చిక్కకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: