ARREST: విశాఖలో నిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో దారి దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి డమ్మీ తుపాకీ, కత్తి, 8 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ డి.గంగాధరం తెలిపారు. ఇటీవల జరిగిన 3 దారి దోపిడీలు కూడా ఇతనే చేసినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలోని నాతయ్యపాలెంకు చెందిన ఆదినారాయణ అలియాస్ అశోక్(30) అనే వ్యక్తి పదో తరగతి వరకు చదివాడు. ఆటోనగర్‌లో వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అయితే అతని తల్లి చీటీల వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి గొలుసు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆన్లైన్లో కత్తి, తుపాకీ నమూనాలో ఉన్న సిగరెట్ లైటర్‌ను కొనుగోలు చేశాడు. అలా రెండుసార్లు దొంగతనాలు చేశాడు. గొలుసు దొంగతనానికి వెళ్లే సమయంలో తన వాహనాన్ని దూరంగా ఉంచి, అందరితో పాటు నడుస్తున్నట్లుగా నటిస్తూ, ఎవరూ లేని ప్రాంతానికి వచ్చిన తర్వాత ముందు వెళ్తున్న మహిళను బెదిరించి మెడలోని గొలుసు లాక్కెళ్తాడు.
ఇదీ జరిగింది: స్టీల్ ప్లాంట్ సెక్టర్-5 బస్టాప్ వద్ద మహిళ మెడలో బంగారం దోచుకుంటుండగా అడ్డుకున్న డీజీఎంపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్‌రెడ్డికి గాయాలయ్యాయి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: