ETV Bharat / crime

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీడీఓ

author img

By

Published : Apr 16, 2021, 7:44 PM IST

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంపీడీఓ ఆల్బర్ట్.. లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా ఏసీబీకి పట్టుబడ్డాడు. శ్మశానవాటికను నిర్మించిన గుత్తేదారు.. దానికి సంబంధించి బిల్లు విడుదల చేయాలని కోరగా.. ఎంపీడీఓ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదర్ రావు తెలిపారు.

mpdo caught bty acb
mpdo caught bty acb in telangana

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంపీడీఓ ఆల్బర్ట్.. లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా అనిశాకు చిక్కాడు. శ్మశానవాటికను నిర్మించిన రామలింగయ్య అనే గుత్తేదారు.. దానికి సంబంధించిన బిల్లును విడుదల చేయాలని కోరగా.. ఎంపీడీఓ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత గుత్తేదారు రూ.20వేలు చెల్లించాడు. మరో రూ.20వేలు ఇస్తేనే.. బిల్లు విడుదల చేస్తానని చెప్పగా.. గుత్తేదారు ఖమ్మంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

రంగంలోకి దిగిన అనిశా.. ఎంపీడీఓ లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ రావు కోరారు.

ఇదీ చదవండి

గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి.. ఇవిగో ఆధారాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.