ETV Bharat / crime

12 ఏళ్ల బాలున్ని చంపిన మైనర్​.. ఎందుకో తెలిస్తే షాక్​ కావాల్సిందే! - అక్రమ సంబంధం విషయం బయటకు చెప్తాడని హత్య

Murder Case Solved: 12 ఏళ్ల బాలుడి హత్య కేసును తెలంగాణ పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు. అయితే.. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు ఓ మైనర్(17 ఏళ్లు)​ కావటం ఆలోచించదగ్గ విషయమైతే.. అసలు హత్య చేయటానికి దారి తీసిన కారణాలు, ఉద్దేశం మరింత ఆసక్తికరం..

Murder Case
Murder Case
author img

By

Published : Feb 8, 2022, 10:11 PM IST

Murder Case Solved: ఈ నెల 6న జరిగిన పన్నెండేళ్ల బాలుడి హత్య కేసును తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితున్ని పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ సమీపంలోని ఓ పంటపొలంలో అక్కంపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు సురేశ్.. ఆదివారం(ఫిబ్రవరి 6న) హత్యకు గురయ్యాడు. మొదట అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

బాలుడిపై అనుమానం..

దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. హత్య జరిగిన రోజు.. అదే గ్రామానికే చెందిన మరో బాలుడు(17 ఏళ్లు) తన సైకిల్​పై సురేశ్​​ను తీసుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. సదరు బాలున్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. సురేశ్​​ను తానే చంపినట్లుగా బాలుడు(నిందితుడు) ఒప్పుకున్నాడు.

రహస్యాన్ని బయటకు చెప్తాడని..

నిందితునికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కాస్తా సురేశ్​కు​ తెలిసింది. తన బండారాన్ని ఎక్కడ బయటకు చెప్తాడోనని భయపడ్డ నిందితుడు సురేశ్​​ను హతమార్చాలనుకున్నాడు. బయటకు వెళ్దామని చెప్పి.. సురేశ్​​ను తన సైకిల్​ మీద పొలాల్లోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో.. తనతో తెచ్చుకున్న కత్తితో సురేశ్​​ను పదిసార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత తన సైకిల్​ను పంట పొలంలో దాచిపెట్టి పరారయ్యాడు. హత్య చేసిన బాలున్ని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు సైకిల్​, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.