ETV Bharat / crime

Gang Rape: మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితులు మైనర్లు! - వరంగల్ వార్తలు

ఆ బాలురకు 15,16 ఏళ్లు ఉంటాయి. చక్కగా చదువుకుంటూ, ఆడిపాడుకుంటూ తిరిగే వయసు అది. కానీ ఆ ముగ్గురు బాలురు మాత్రం తమలోని మృగాళ్లను బయటకు తీశారు. మూగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్​ఫోన్​లో దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్​లో చోటు చేసుకుంది.

gang rape
gang rape
author img

By

Published : Jun 14, 2021, 11:25 AM IST

తెలంగాణలోని వరంగల్​కు చెందిన ఓ మూగ యువతికి చిన్నతనంలోనే తల్లి కాలం చేసింది. ఇటీవల తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. చూపు సరిగా కనిపించని అమ్మమ్మకు చేదోడు వాదోడుగా ఉంటుంది.

ఆ మూగ యువతిపై ముగ్గురు బాలురు కన్నేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి చొరబడ్డారు. చూపు సరిగా కనిపించని అమ్మమ్మకు అనుమానం రాకుండా మాటల్లోకి దించారు. ఒక్కొక్కరుగా వెళ్లి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్​ఫోన్​లో వీడియో చిత్రీకరించారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

తండ్రి ఇంటికి రాగానే యువతి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన బాలుర వయసు 15, 16 ఏళ్లు ఉంటాయని పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి:

సీఎంకు రఘురామ ఐదో లేఖ: ఈ సారి ఏ హామీని గుర్తు చేశారంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.