కేంద్రపాలిత యానాంలో.. ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ధ్రువకుమార్ వారం రోజులుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు. నిన్న అర్థరాత్రి సమయంలో ధ్రువకుమార్ స్పృహ తప్పి పడిపోవడంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపగా కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: దర్శనీయ ప్రాంతాల్లో కొరవడిన వసతి సదుపాయాలు