కర్నూలు జిల్లాలో నకిలీ ఆయిల్, టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ప్యారాచూట్ ఆయిల్, రెడ్ లేబుల్ టీపొడిని ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వ్యాపారం జరుపుతున్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నకిలీ కొబ్బరినూనె, టీ పొడి స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయ వ్యాపారం 7 రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు.
కర్నూలులో నకిలీ ఆయిల్, టీ పొడి తయారీ.. ముఠా అరెస్టు
12:28 September 06
హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తింపు