ద్విచక్రవాహనాలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ ఆకర్షణీయ పథకాలతో వందలాది మందిని బురిడీ కొట్టించిన కి‘లేడీ’ కునుకుల పల్లవిరెడ్డి(32)ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసులు (cheating woman arrest )దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సహకరించిన మరొకర్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో పల్లవిరెడ్డి( kanukula pallavi reddy arrested) వెల్లడించిన అంశాలు చూసి దర్యాప్తు అధికారులే నివ్వెరపోయారు.
40 మందితో కాల్‌సెంటర్...
ఈ ఆలోచన మీకెలా వచ్చిందని అడిగితే నిందితురాలు(Cheater kanukula pallavi reddy) చెప్పిన సమాధానం విని పోలీసులు కంగుతిన్నారు. ‘ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటూ అంతర్జాలంలో శోధించా. ఓ వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే ఫ్రాంచైజీ తీసుకోవాలన్నారు. అందుకే వేరే వ్యక్తి పేరిట సభ్యత్వం తీసుకుని.. వాళ్లు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకున్నా. కుషాయిగూడ, దమ్మాయిగూడ, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో మల్టీబ్రాండ్ షోరూంలను ప్రారంభించా’నని ఆమె పోలీసులకు వివరించారు. 40 మందితో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ తెరిచినట్లు గుర్తించారు.
రూ.2 వేలకు 10 వేల ఫోన్ నంబర్లు..
తొలుత ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేద్దామా..? అనుకుంటున్న తరుణంలో వ్యక్తిగత వివరాలను విక్రయించే వెబ్‌సైట్లు, యాప్స్ గురించి తెలిసింది. ఓ యాప్‌లో రూ.2 వేలు వెచ్చించి 10 వేల మంది ఫోన్ నంబర్లు, ఇతరత్రా వివరాలను సేకరించాను. టెలీకాలర్స్‌తో వారందరికీ ఫోన్లు చేయించి షోరూంకు రప్పించాను. అక్కడికొచ్చిన తర్వాత స్టాంప్ కాగితంపై ఒప్పందం రాసిచ్చా. నమ్మకం కుదిరి ఒకరు నలుగుర్ని.. ఆ నలుగురు మరో 16 మందిని.. ఇలా వందలాది మందిని సభ్యులుగా చేర్చారు. ఈమె బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని జవహర్‌నగర్ పోలీసులు ప్రాథమికంగా(cheating woman arrest) నిర్ధారించారు. రూ.5 కోట్లపైగానే వసూలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారించి పూర్తి వివరాలు రాబట్టాలని చూస్తున్నారు.
ప్రచారానికి ‘పీఆర్’ సంస్థతో ఒప్పందం..
సభ్యుల నుంచి కొల్లగొట్టిన సొమ్ముతో విలాస జీవితం గడిపినట్లు పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీకి బౌన్సర్లు పెట్టుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయించారు. ఇందుకోసం ఓ పీఆర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. చిన్నప్పటి నుంచి డాక్టరవ్వాలని అనుకునేది. వీలు కాకపోవడంతో కనీసం పేరు పక్కనైనా డాక్టర్ అనే గౌరవాన్ని చూసుకోవాలనుకుంది. డబ్బు చెల్లించి మధ్యవర్తి సాయంతో గౌరవ డాక్టరేట్‌ను(duplicate Doctorate person arrest) కొనుక్కున్నట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.