FOUR PEOPLE SUICIDE DUE TO FAMILY ISSUES : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. తార్నాకలోని ఓయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రూపాలి అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతో నాలుగేళ్ల చిన్నారి సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గది తలుపులు తెరిచిచూశారు.
అప్పటికే దంపతులు, మరో మహిళ, నాలుగేళ్ల చిన్నారి మృతి చెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారు ప్రతాప్.. ఆయన భార్య సింధూర, నాలుగేళ్ల కుమార్తె ఆద్య, తల్లి రజతిగా పేర్కొన్నారు. ప్రతాప్ బీఎండబ్ల్యూ కారు షోరూమ్‌లో డిజైనర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. సింధూర హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: