Childrens Missing: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మున్నేరులో ఇసుక కోసం తవ్విన గుంతలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు బయటకు తీసుకువచ్చారు.
సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అవుతున్నా.. తిరిగి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లల దుస్తులు.. వారు వేసుకొని వెళ్లిన సైకిళ్లు మున్నేరు వాగు ఒడ్డున ఉండటాన్ని గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులంతా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించారు. నిన్న రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.