వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని హనుమప్ప వీధిలో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్న గోదాంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 3.50 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
*మరో ఘటనలో నగర శివారులోని విశ్వనాథపురం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.
కృష్ణా జిల్లా: చల్లపల్లి మండలం రామానగరంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి దుస్తుల షాపు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు చెలరేగి... అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దుకాణంలో ఉన్న కుట్టుమిషన్లు, దుస్తులు మొత్తం కాలిబూడిదయ్యాయని.. యజమానురాలు వాపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 3లక్షలు నష్టపోయినట్లు బాధితురాలు తెలిపింది.
గుంటూరు జిల్లా: మొక్కజొన్న పంటకు నిప్పంటుకొని భారీగా నష్టం వాటిల్లిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగింది. తెనాలి మండలం పెనుగుదురులపాడు సమీపంలో కొందరు.. మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించారు. సాయంత్రం పెనుగాలుల బీభత్సానికి.. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇవీ చదవండి: Cyclone Asani: తీవ్రంగా మారిన 'అసని'.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు