పగలు- రాత్రి, ఇంటా-బయట అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. రోజూ ఎక్కడో చోట ఆకృత్యాలు వెలుగు చేస్తూనే ఉన్నాయి. వావి వరసలు మరచి.. లైంగిక దాడులు చేస్తున్నారు. మహిళలపై దాడి ఘటనల్లో చాలా మేరకు దగ్గరి బంధువులు, స్థానికులే నిందితులుగా ఉంటున్నారు.
తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మరో దారుణం జరిగింది. కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యానికి (Sexual assault on daughter) పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రే లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కీచక తండ్రికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికుల సాయంతో బాధితురాలు డయల్ 100కు సమాచారం ఇచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కీచక తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: CM Jagan: 'సచివాలయాలను డిసెంబరు నుంచి సందర్శిస్తా'