ETV Bharat / crime

వావి వరసలు మరచి.. కంటిపాపనే కాటేసి.. - కూతురిపై అత్యాచారం

మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించాడు ఓ కసాయి తండ్రి. కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు ఆ కామాంధుడు. కన్నకూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

father attempt rape on daughter
కూతురిపై తండ్రి అత్యాచారం
author img

By

Published : Apr 18, 2021, 7:14 PM IST

కన్నతండ్రే కసాయిలా ప్రవర్తించాడు. వావి వరసలు మరిచిపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

తల్లి బట్టలు ఉతికేందుకు వెళ్లగా దారుణం...

శనివారం తన ఆరేళ్ల చిన్నారిని ఇంట్లో ఉంచిన తల్లి.. గ్రామ సమీపంలోని కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లింది. అప్పటికే మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు విన్న తల్లి ఇంటికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం గుర్తించిన తల్లి గ్రామస్థులకు తెలియజేయడంతో వెంటనే పాపను చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిందితుడి అరెస్ట్..

చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

లారీ కిందకి దూసుకెళ్లిన బైక్​.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.