రెండేళ్ల కుమారుడిని అతి కిరాతంగా హత్య(Father killed son) చేశాడో తండ్రి. ఈ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్, ప్రశాంత్‌నగర్(కొసరాజు ఆసుపత్రి వీధిలో)కు చెందిన హసీబ్(38)కు, మొఘల్‌కానా ప్రాంతానికి చెందిన హస్రత్ బేగం(30)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇస్మాయిల్(2), రెహాన్(8 నెలలు) సంతానం.
మూడేళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన హసీబ్ అప్పుడప్పుడు వింతగా ప్రవరిస్తుంటాడు. సంస్థ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇంట్లోనే ఉంటూ తరచూ పెద్దగా అరుస్తూ హంగామా చేస్తుంటాడు. భార్య హస్రత్తో తరచూ గొడవ పడుతుంటాడు. తన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ తన కుమారుడు కాదంటూ ఆమెను వేధిస్తుంటాడు.
శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు ఇస్మాయిల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆడుకుంటున్నాడు. మొదటి అంతస్తు నుంచి కిందికి వచ్చిన తండ్రి.. కుమారుణ్ని మొదటి అంతస్తులోని గదిలోకి తీసుకెళ్లి కత్తితో గొంతు(Father killed son) కోశాడు. గదిలోనే పడేసి కిందికి దిగి పారిపోయాడు. హసీబ్ చేతులకు రక్తం ఉండడం గమనించిన అతని తల్లి ఖుస్రూబేగం, భార్య హస్రత్‌బేగం పరుగెత్తుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఇస్మాయిల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
హసీబ్ కొద్దికాలంగా అనుమానంతో హస్రత్‌ను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్ తన కుమారుడు కాదంటూ అనుమానంతో వేధించేవాడని చెప్పారు. ఆ కోపంతోనే బాలుణ్ని హత్య(Father killed son) చేసుంటాడని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు.. హసీబ్ మానసిక స్థితి సరిగా లేక మందులు వాడుతున్నట్లు తెలిసింది. హత్య అనంతరం నిందితుడు లంగర్‌హౌస్ చౌరస్తా, ఫ్లోర్‌మిల్ మీదుగా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి హసీబ్ కోసం గాలిస్తున్నారు.