గుంటూరు జిల్లా కేంద్రంలో డెంగీ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రీ కుమారులు మృతి చెందారు. జిల్లాలోని వేమూరు మండలం బలిజపాలేనికి చెందిన రవికుమార్(55) ఆయన కుమారుడు రవితేజ(24)లకు ఇటీవలే డెంగీ సోకింది. కుటుంబ సభ్యులు వీరిద్దరిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ... ఈరోజు ముందుగా తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే కుమారుడు కూడా మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవికుమార్ ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్ ధాటికి అన్నదాతకు కష్టాలు