Lockup Death: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల పీఎస్‌లో ప్రైవేటు ఎలక్ట్రిషియన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. శాంతినగర్‌కు చెందిన సురేష్ అలియాస్ రాంబాబును చోరీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు రాంబాబు పీఎస్‌లో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఎలక్ట్రిషియన్ మృతిపై కలెక్టర్ స్పందించి.. విచారణకు ఆదేశించారు. రాంబాబు మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆస్పత్రి మార్చురీలో ఉన్న రాంబాబు మృతదేహన్ని ఆర్డీవో భవానీ శంకర్ పరిశీలించారు. మృతి ఘటనపై పీఎస్‌లో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని ఆర్డీవో తెలిపారు.
ఇదీ చదవండి: