Keyman Saved Woman and Childs: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన మహిళ భర్తతో గొడవపడి తల్లిగారింటికి బయల్దేరింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వచ్చింది. అక్కడినుంచి దుర్గాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. ఇద్దరు పిల్లలతో సహా విశాఖ-విజయవాడ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుంది. ఇది గమనించిన రైల్వే కీమాన్ వెంకటేశ్వరరావు.. ముగ్గురిని రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. మహిళతో మాట్లాడి కాకినాడ దిశ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముగ్గురు ప్రాణాలు కాపాడిన కీమాన్ వెంకటేశ్వరరావును పోలీసులతో పాటు పలువురు అభినందించారు.
ఇవీ చదవండి: