Firing in Train: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ (దురంతో ఎక్స్‌ప్రెస్) వెళ్తున్న రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. రైలు మంచిర్యాల సమీపానికి చేరుకున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. గొడవ జరుగుతున్న క్రమంలోనే ఓ వ్యక్తి.. ఎదుటి వ్యక్తి దగ్గర తుపాకి తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది గమనించిన టికెట్ కలెక్టర్.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గొడవపడిన ఇద్దరిని.. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులు.. ఆర్మీలో పని చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఇదీ చదవండి :