'హలో మేము సీఎం కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు అంగన్వాడీ కార్యకర్తలేగా.. మీరు చేసిన సేవలు నచ్చి 50 వేల రూపాయలు బహుమతిగా పంపించాలనుకుంటున్నాం. మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ చెప్తే.. మీ ఖాతాలో డబ్బులు పడ్తాయి'... అంటూ ఫోన్ చేసి అంగన్వాడీ కార్యకర్తల బ్యాంకు ఖాతాల్లోంచి లక్ష రూపాయల దోచేశారు సైబర్ నేరస్తులు. ఈ ఘనటపై బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలు సైబర్ నేరగాళ్ల మోసంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం పేరుతో నిందుతులు ఫోన్ చేసి... ఫోన్ నెంబర్ ఇవ్వమన్నట్లు పేర్కొన్నారు. మీ ఖాతాలో రూ.50 వేలు జమ చేస్తామంటూ ఫోన్‌కి వచ్చిన ఓటీపీలు తెలుసుకొని... తమ బ్యాంకు ఖాతాల నుంచి లక్ష రూపాయలు దోచేసినట్లు సైబర్ క్రైమ్ విభాగానికి ఆన్‌లైన్ ద్వారా బాధితులు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దోచేసి వాళ్లను త్వరగా పట్టుకొని తమ డబ్బును తమకిప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..