ETV Bharat / crime

Gold at Airport: గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టివేత.. ఎంతంటే..! - seized gold

CUSTOM RAIDS AT AIRPORT : విజయవాడ (గన్నవరం) విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. ఓ మహిళ షార్జా నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న కస్టమ్స్​ అధికారులు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేసేదని.. ప్రస్తుతం ఆమె భర్త ప్రభుత్వంలోని కీలక శాఖలో అధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది.

CUSTOM RAIDS AT VIJAYAWADA AIRPORT
CUSTOM RAIDS AT VIJAYAWADA AIRPORT
author img

By

Published : Sep 9, 2022, 8:37 PM IST

CUSTOM RAIDS AT VIJAYAWADA AIRPORT : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. వందేభారత్‌మిషన్‌లో భాగంగా షార్జా నుంచి 38 మంది ప్రయాణికులతో ఐఎక్స్‌536 ప్రత్యేక ఎయిర్‌ఇండియా విమానం గురువారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. విమానంలో వచ్చిన ఓ ప్రయాణికురాలు 1.6కేజీల బంగారం అక్రమంగా తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సామగ్రి స్కానింగ్‌లో అనధికారికంగా బంగారం తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికురాలు గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆమె భర్త ప్రస్తుతం ప్రభుత్వంలోని కీలకశాఖలో ఉన్నత ఉద్యోగిగా పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి పట్టుబడిన సదరు మహిళ వివరాలను విచారణ పేరుతో సుమారు 20గంటలపాటు గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన మహిళ విజయవాడకు చెందినట్లుగా సమాచారం. పట్టుబడిన బంగారం, ఇతరత్ర వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.