ETV Bharat / crime

CRIME NEWS: హోలీ వేడుకల్లో విషాదం... కాల్వలో గల్లంతయిన విద్యార్థి - ఆంధ్రప్రదేశ్​లో నేర వార్తలు

CRIME NEWS: రాష్ట్రంలో పలు చోట్ల కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మరణించారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో రెండ్రోజుల క్రితం హత్యకు గురైన వ్యాపారి ఆదినారాయణ బంధువులు.. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. తూర్పుగోదావరిలో నకిలీ పత్రాలు సృష్టించి రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

CRIME NEWS IN ANDHRA PRADESH
ఏపీలో నేరవార్తలు
author img

By

Published : Mar 18, 2022, 1:26 PM IST

Updated : Mar 18, 2022, 9:09 PM IST

CRIME NEWS: పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామంలో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. చిన్న కాపవరం కాలువలో స్నానం చేసేందుకు దిగిన తొమ్మిదో తరగతి చదువుతున్న సిరికి ఆకాష్(16) అనే యువకుడు గల్లంతయ్యాడు. నలుగురు స్నేహితులతో కలిసి హోలీ ఆడుకొని స్నానం చేయడానికి కాల్వలోకి దిగగా, నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో స్నేహితులు చూస్తుండగానే కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు సహాయంతో తాడేపల్లిగూడెం పోలీస్, ఫైర్, రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపట్టారు.

నకిలీ పత్రాలు సృష్టించిన నలుగురి అరెస్ట్​...

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామీణ మండలం పరిధిలోని 17.77 ఎకరాలకు.. కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేశారు. ఆ భూములకు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2020 డిసెంబరులో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ తొమ్మిది మందిపై ఫిర్యాదు చేశారు. కేసులో 2020లో అయిదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో నలుగురిని తాజాగా అరెస్ట్​ చేసి.. రిమాండ్​కు తరలించారు.

కరెంటు షాక్​తో లారీ డ్రైవర్ మృతి

కృష్ణాజిల్లా బొమ్ములూరులో కరెంట్‌ షాక్‌ తగిలి.. లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. లారీలో ఇసుక అన్​లోడ్ చేస్తుండగా.. కరెంటు వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. జిల్లాలోని గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు శివారు టిడ్కో గృహాల సముదాయంలో.. నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలకు ఇసుకను అన్​లోడ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రధానోపాధ్యాయురాలు ఆత్మహత్య

కుటుంబకలహాలతో.. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలో చోటు చేసుకుంది. బత్తులవారిపాలెం ఎంపీపీ పాఠశాల హెచ్​ఎంగా విధులు నిర్వహిస్తున్న పి.విజయనిర్మల (43)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఆమెకు విభేదాలుండగా.. కొద్ది రోజులక్రితమే ఆమె భర్త మరణించారు. ఈ నేపథ్యంలో భర్త మృతికి భార్యే కారణమని బంధువులు విమర్శించారు. దాన్ని తట్టుకోలేకే విజయనిర్మల ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వ్యాపారి ఆదినారాయణ బంధువులు.. మృతదేహంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆదినారాయణను చంపిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు సద్దిచెప్పడంతో.. వారు ఆందోళనను విరమించారు.

భార్య తరుపు కుటుంబ సభ్యుల వల్లే..

తన చావుకు భార్య తరుపు కుటుంబ సభ్యులే.. కారణమని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన.. కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముజఫర్ నగర్ కు చెందిన హుస్సేన్ భాషాకు.. 5నెలల క్రితం కర్నూలు మధిరాజ్​నగర్​కు చెందిన ఓ యువతితో వివాహమైంది. అయితే.. అమ్మాయికి మానసిక స్థితి సరిగ్గా లేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన భార్య కుటుంబ సభ్యుల వల్లే తాను చనిపోతున్నానని.. హుస్సేన్​ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వాహనం బోల్తా... ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామం సమీపంలో బియ్యం లోడ్​తో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జాలిమంచి గ్రామం నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని పెద్ద తుంబలం పోలీసులు తెలిపారు. మృతుడు శాంతిరాజ్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చికిత్స పొందుతూ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి..

శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించిన గురుకుల పాఠశాల విద్యార్థిని అమృత కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమృత రాయచోటిలోని గురుకుల విద్యా పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఈ నెల 16వ తేదీన పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో అమృత చీటీ పెట్టి పరీక్ష రాస్తుండగా మేడం గుర్తించి చీటీని తీసేసింది. దీంతో మార్కులు తక్కువ వస్తాయని మనస్థాపానికి గురైన అమృత తరగతి గదిలో ఎవరూ లేని సమయంలో తన వద్ద ఉన్న శానిటైజర్ తాగింది. వెంటనే తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్​కు తెలియజేయగా వెంటనే రాయచోటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిన్నటి వరకు బాగానే మాట్లాడిన అమృత ఇవాళ మృతి చెందింది. అమృత వద్ద సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన స్థానికులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మహానాడులో ద్విచక్ర వాహనాన్ని అపహరించేందుకు వచ్చిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహానాడు ఒకటో లైన్​లో ఉంటున్న రామ్ గోపాల్ మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తించి ద్విచక్ర వాహనాన్ని అపహరిచేందుకు ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. దీనిని గమనించిన ఇంటి యజమాని.. అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ దృశ్యాలు రోడ్డు పైన ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దాడి జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రామ్ గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.

కుళ్లిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లి గ్రామ సమీపంలో కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తిని కొప్పుల వెంకటేశ్వర్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడు చెడు అలవాట్లకు బానిసై అప్పులు ఎక్కువగా చేసినట్లు, అప్పులు తీర్చే క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. మృతుడు ఐదు నెలల క్రితం అదృశ్యమైనట్లు మృతుడి కుటుంబ సభ్యులు గిద్దలూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడు చివరిసారిగా మాట్లాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

సరదాగా ఈతకు వెళ్లి.. విద్యార్థి మృతి

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణానికి చెందిన సుధీర్ (17) స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం కిరికెర గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే సుధీర్ బావిలో మునిగి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి స్నేహితులు గ్రామస్తులకు తెలియజేశారు. వారు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో గురువారం అర్థరాత్రి వరకు యువకుడి కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. హిందూపురం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెరువులోకి దిగి ఇద్దరు మృతి..

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అయ్యప్పగానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. హోలీ సంబరాల తర్వాత చెరువులో స్నానానికి దిగి ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులను అశోక్ (12), సరిత (17)గా గుర్తించారు.

ఇదీ చదవండి: అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్​

Last Updated : Mar 18, 2022, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.