COMPLAINT ON SUSHMA PARENTS : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రేమ వివాహం చేసుకున్న మోహన్‌కృష్ణ, సుష్మల ఇంటిపై యువతి తల్లిదండ్రులు దాడి చేయటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుష్మ తల్లిదండ్రులతో పాటు మరో 16 మందిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సుష్మ, మోహన్‌కృష్ణల పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో.. ఆగస్టు 27న రహస్యంగా చంద్రగిరిలోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఆగ్రహించిన సుష్మ తల్లిదండ్రులు.. మోహన కృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న సుష్మ, మోహన్‌కృష్ణలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సుష్మను మోహనకృష్ణ వెంట పంపించారు.
ఇవీ చదవండి: