తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన సమగ్ర బేగం భర్త విదేశాల నుంచి వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌కు తీసుకెళ్తుండగా... బస్సులో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తెలిసిన మాంత్రికుడు ఉన్నాడని... అతని పేరు చాంద్‌ఖాన్ అని... అతనిని కలిస్తే నీ భర్తకు నయం అవుతుందని తెలిపాడు. దీంతో దంపతులు మంత్రికుడిని కలిశారు. చేతబడి చేశారని... నయం చేస్తానని యాభైవేలు తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత సమగ్ర బేగం భర్త మృతిచెందాడు. అనంతరం... చాంద్ ఖాన్ తనను పెళ్లి చేసుకోవాలని సమగ్ర బేగంపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో భర్తను చంపినట్లే కొడుకును చంపేస్తానని బెదిరించాడు. భయపడిన సమగ్ర బంధువులకు విషయం చెప్పి మాంత్రికుడి హత్యకు పథకం రూపొందించారు. పథకం ప్రకారం చాంద్ ఖాన్‌ను మామడ మండలంలోని న్యూ సాంగ్వీ గ్రామానికి రప్పించి... చికెన్‌లో నిద్రమాత్రలు కలిపి తినిపించారు. మత్తులోకి జారుకున్నాక అక్కడే ఉన్న బంధువులు కర్రలు, రాళ్లతో మోది హత్య చేసారు. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యారు.
మృతుడి కాల్ డేటా ఆధారంగా సమగ్ర బేగంను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: