కృష్ణా జిల్లా గన్నవరం రైల్వే స్టేషన్(gannavaram railway station) సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ-ఏలూరు రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి రైల్వే, స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు.
తొలుత మృతుడి తల మాత్రమే కనిపించి మొండెం కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని గాలించగా సమీపంలో ఇతర శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతుడు ఎవరు ? ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు.