వారింట్లో వారసుడు పుట్టాడనే ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే... ఆ మాయదారి విక్స్ డబ్బాను పిల్లాడికి అందుబాటులోనే పెట్టకపోదురు ఆ కుటుంబసభ్యులు. పిల్లోడు కదా బొమ్మలతో పాటు దీనితో కూడా ఆడుకుంటాడులే అనుకుని ఉంటారు. కానీ విక్స్ డబ్బా రూపంలో మృత్యువు 7 నెలల బాలుడి(baby boy died due)ని వెంటాడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని నల్గొండ, తొండ్లాయి గ్రామంలో జరిగింది.
అప్పటివరకు బొమ్మలతో ఆడుకుంటున్న బాలుడు విక్స్ డబ్బాను మింగేశాడు. దీంతో ఊపిరాడక పసికందు ఇబ్బంది పడి ఏడుస్తుంటే... ఇంట్లో వాళ్లు తనని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ దారి మధ్యలోనే బాలుడు ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి..
ganja in Hyderabad: హైదరాబాద్లో స్త్రీలను భయపెడుతున్న 'సింగరేణి’ కాలనీలెన్నో'...