విశాఖ ఎన్టీపీసీకి బొగ్గు కొరత... మొదటి యూనిట్‌లో నిలిచిపోయిన ఉత్పత్తి విశాఖ ఎన్టీపీసీలో బొగ్గు కొరత మరింత తీవ్రమైంది. తగినంత బొగ్గులేక ఇప్పటికే 3, 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోగా ఇవాళ మొదటి యూనిట్‌లోనూ ఆగిపోయింది. ప్రస్తుతం రెండో యూనిట్‌లో మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో నిల్వలు పెరగకపోతే అందులోనూ ఉత్పత్తి నిలిచిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ ఎన్టీపీసీలో మొత్తం నాలుగు యూనిట్లకుగానూ 3 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిన కారణంగా 15 వందల మెగావాట్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఒడిశా నుంచి రోజూ 20 రేక్‌ల బొగ్గు విశాఖలోని ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్‌కు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు రేక్‌లకు మించి రావట్లేదని అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలో బొగ్గు గనుల వద్ద సమ్మె వల్ల సరఫరాపై ప్రభావం పడిందని చెబుతున్నారు.ఇవీ చూడండి- 'ఇసుక కొరత తీర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టండి'