కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న నౌకలను విశాఖ నౌకాశ్రయానికి పది నాటికల్ మైళ్ల దూరంలోనే బంగాళాఖాతంలో నిలిపివేస్తున్నారు. 14 రోజుల క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాతే వాటిని విశాఖ నౌకాశ్రయం జట్టీల వద్దకు అనుమతిస్తున్నారు. కరోనా ప్రభావిత దేశం నుంచి బయలుదేరిన తర్వాత 14 రోజుల కాలాన్ని క్వారంటైన్ సమయంగా పరిగణిస్తున్నారు. సుదూర దేశాల నుంచి విశాఖ వచ్చేనాటికి 14 రోజులు దాటితే అలాంటి నౌకలను మాత్రం అనుమతిస్తున్నారు. తొలుత వీటిని పది నాటికల్ మైళ్ల దూరంలోనే నిలిపి అందులోని మాస్టర్ నుంచి ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరిస్తున్నారు. ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే నౌకను నౌకాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.
ఇవీ చదవండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి.